Saturday, September 14, 2024

50 మంది ఎమ్మెల్యేలు..తలో వందకోట్లు ?

- Advertisement -
- Advertisement -

కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బిజెపి యత్నిస్తోందని విమర్శించారు. ఇందుకు వీరు ఓ గ్యాంగుగా మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ 100 కోట్ల మేర పెద్ద ఆఫర్ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమారు గౌడ ఆరోపించారు. ఇక్కడ ఆపరేషన్ కమల్ సాగుతోందన్నారు. ప్రజా తీర్పుతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడమే బిజెపి ఆపరేషన్ అని మాండ్య ఎమ్మెల్యే పేర్కొన్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే, ప్రహ్లాద్ జోషితో పాటు జెడిఎస్ నేత కుమారస్వామి ముఠాగా మారారని, ఎమ్మెల్యేల కోసం గాలాలు వేస్తున్నారని ఆదివారం ఇక్కడ చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగేరకం కాదని,బిజెపి గ్యాంగ్ కుట్రలు విఫలం అవుతాయని తెలిపారు. 50 మంది ఎమ్మెల్యేలు కావాలని, వీరికి తలో వంద కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారని ఆరోపించారు. తనకు కూడా ఓ వ్యక్తి ఫోన్ చేసి వంద కోట్లు ఇస్తామని, పార్టీ మారుతారా? అని అడిగారని, వీరిని ఇడికి పట్టిద్దామని తాను ఇందుకు ఓకె చెప్పానని, వారిని ఏదో ఒకరోజు వందల కోట్లతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడేలా చేస్తామని, అవకాశం కోసం చూస్తున్నామని వెల్లడించారు. వారి ఆటలకు చెక్‌పెడుతామని , తమ ప్రభుత్వం ప్రజల పక్షం అని, ప్రజలకోసం పాటుపడుతుందని, నోట్లకు అమ్ముడుపోయే రకం వారు పార్టీలో లేరని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News