Monday, January 20, 2025

నేడు బిజెపి పదాధికారుల సమావేశం: శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేడు మధ్యాహ్నం ఒంటి గంటలకు బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో బిజెపి జాతీయ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు , పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు,మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, బిజెపి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు పాల్గొంటారని వెల్లడించారు. పార్టీ రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలు, విపక్ష పార్టీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలను, రాజకీయ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News