Thursday, January 23, 2025

బిజెపి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్..

- Advertisement -
- Advertisement -

BJP Party Suspends MLA Raja Singh

మైదారబాద్: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై పై సీరియస్ గా ఉన్న బిజెపి హైకమండ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని కేంద్ర క్రమశిక్షణ సంఘం పేర్కొంది. వివరణ ఇచ్చేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని హైకమండ్ సూచించింది. శాషనసభాపక్షనేత పదవి నుంచి కూడా రాజాసింగ్ ను తప్పిస్తూ బిజెపి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

BJP Party Suspends MLA Raja Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News