Monday, December 23, 2024

బిజెపి పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బిజెపి పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి ప్రలోభాలకు తలొగ్గకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేదిలేదని తేల్చి చెప్పారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో బిజెపి ఓట్లు వేరే పార్టీకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఎవరు ఏం చేసినా రేవంత్ రెడ్డే సిఎంగా ఉంటారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే శ్రీరామ రక్ష అని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News