Wednesday, January 22, 2025

మునుగోడులో ఓటర్ల నమోదుపై హైకోర్టులో బిజెపి పిటిషన్

- Advertisement -
- Advertisement -

Telangana High Court

హైదరాబాద్: మునుగోడులో ఓటర్ల నమోదుపై హైకోర్టులో బిజెపి పిటిషన్ దాఖలు చేసింది. జులై 31 వరకు ఉన్న ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని బిజెపి కోరింది. ఫామ్‌ 6 కింద అప్లై చేసుకున్నవారిలో తప్పుడు ఓటర్లు ఉన్నారని కమలం పార్టీ తెలిపింది. తక్కువ టైమ్‌లోనే సుమారు 25 వేల దరఖాస్తులు వచ్చాయని కోర్టుకు వెల్లడించింది. ఈ నెల 14న ఎన్నికల సంఘం మునుగోడు ఓటర్ల లిస్ట్‌ను ప్రకటించనుందని… హైకోర్టు ఆదేశించేంత వరకూ ఓటర్ల లిస్ట్ ప్రకటించవద్దని ఉత్తర్వులు ఇవ్వాలని బిజెపి కోరింది. కాగా బిజెపి దాఖలు చేసిన పిటిషన్‌‌పై ఈనెల 13న తెలంగాణ హైకోర్టు విచారించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News