హైదరాబాద్ : నరేంద్ర మోడీ ప్రధానిగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెలరోజుల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తెలిపారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మహాజన్ సంపర్క్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 396 బహిరంగ సభలు నిర్వహిస్తామని, వీటిలో 52 భారీ బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు.
Also Read: ఈ-గరుడ బస్సుల ఛార్జీల తగ్గింపు
వాటిలో రెండు బహిరంగ సభలు రాష్ట్రంలో ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే బహిరంగ సభల్లో ఒకటి ఉత్తర తెలంగాణ మరొకటి దక్షిణ తెలంగాణలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఈ నెల 23 న పది లక్షల మంది బూత్ కార్యక ర్తలతో ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రసంగిస్తారని తెలిపారు. 25 నుంచి 30 వరకు ఇంటింటికి బిజెపి కార్యక్రమం, 25న ఎమర్జెన్సీ దినం సందర్భంగా ఆనాటి అరాచకాలను ప్రజలకు వివరించనున్నామని తెలిపారు.