న్యూఢిల్లీ: బిజెపిపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బిజెపి ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘గుజరాత్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బిజెపి కుట్రపన్నుతోంది. ఈ కుట్రలో బిజెపి ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయముంది. కేజ్రీవాల్‌పై దాడి చేయాలని తమ గూండాలను ఆయన బహిరంగంగానే పురిగొల్పుతున్నారు. ఈ చౌకబారు రాజకీయాలకు మా పార్టీ(ఆప్) భయపడబోదు. బిజెపి గూండాయిజానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’ అని స్పష్టంచేశారు.
गुजरात व MCD हारने के डर से बौखलाई व @ArvindKejriwal जी को अपनी साजिशो मे फँसाने मे फेल भाजपा उनकी हत्या का ताना-बाना बुन रही है
इस तरह खुलेआम दिल्ली के मुख्यमंत्री को हत्या की धमकी देने वाले मनोज तिवारी के खिलाफ सख्त कारवाई करते हुए गिरफ्तार कर इस पूरी साजिश की जाँच होनी चाहिए
— Manish Sisodia (@msisodia) November 25, 2022
ఇటీవల కేజ్రీవాల్ భద్రత గురించి బిజెపి ఎంపీ మనోజ్ తివారీ పలు వ్యాఖ్యలు చేశారు. ‘అంతులేకుండా కొనసాగుతన్న అవినీతి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, జైల్లో ఆప్ మంత్రికి మసాజులు వంటి పరిణామాల పట్ల ఆప్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భద్రతపై నాకు ఆందోళనగా ఉంది. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలను చితకబాదిన ఘటనలు కూడా చూశాం. ఇలాంటి అనుభవం ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురు కాకూడదని కోరుకుంటున్న’ అంటూ వ్యాఖ్యానించారు. తివారీ వ్యాఖ్యలపై తాజాగా మనీశ్ సిసోడియా పై విధంగా స్పందించారు.
अरविंद केजरीवाल जी की सुरक्षा को लेकर मैं चिंतित हुँ,क्योंकि लगातार भ्रष्टाचार,टिकिट बिक्री व जेल में बलात्कारी से दोस्ती व मसाज प्रकरण को लेकर AAP कार्यकर्ता व जनता ग़ुस्से में हैं।इनके MLA पिटे भी हैं। इसलिए दिल्ली के सीएम के साथ ऐसा ना हो.. सजा न्यायालय ही दे 🙏
— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) November 24, 2022