ఎంఎల్‌ఎసి అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించడం దారుణం
మంత్రి హరీశ్‌రావు ఫైర్
మన తెలంగాణ /మెదక్ ప్రతినిధి: గవర్నర్ కోటా కింద ప్ర కటించిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళిసై తిరస్కరించడం సరికాదని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నద ని, గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జరిగిన ఎరుకల సాధికారిక పథకం ప్రారంభోత్సవానికి మంత్రులు తన్నీ రు హరీష్ రావు, సత్యవతిరాథోడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎరుకల అభివృద్ధికి 1, సొసైటీ, స్లాటర్ హౌసులు, కోల్ స్టోరేజీల ఏర్పా టు, రవాణాసౌకర్యాలు, ఆన్‌లైన్ వ్యాపార మెలకువలలో ప్రావీణ్యం పెంపొందిస్తామని హరీశ్‌రావు హామీచ్చారు. పెం చిన పందులను హైదరాబాద్ తరలించడానికి వాహనాలు అందుబాటులోకి తేస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేసుకోవటానికి కూడా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని హరీశ్‌రావు తెలిపారు. వచ్చే ఫైనాన్షియ ల్ ఇయర్‌లో కుల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. రాష్టంలో మొదటిసారి ఎరుకలజాతి ఎదుగుదలకు సొసైటీలు ఏర్పాటు చేశామన్నారు. ఎరుకల జాతిలో ఒకరికి, విశ్వ బ్రాహ్మణ కులంలో ఇంకొకరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించామన్నారు. ఇలాంటి వారిని గవర్నర్ తిరస్కరించడం సరికాదన్నారు.
గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బిజెపి నీచ రాజకీయం చేస్తుందని దీనికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.ఎరుకల జాతికిఎమ్మెల్సీ వస్తే జాతి మొత్తం బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటుందేమోనని గవర్నర్ కు అనుమానమన్నారు.విశ్వబ్రాహ్మణులు, ఎరుకల కులాలు జట్టు కట్టి బిజెపికి గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు కోరారు. ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ ఇచ్చిందా..? బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా.. బీఆర్‌ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా..? బిజెపి వాళ్ళు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తునారు. వారికి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో బిజెపి వాళ్ళకి నామినేట్ పదవులు కట్టబెట్టారు. ఆ రాష్ట్రానికి ఒక నీతి… మన రాష్ట్రానికి ఒక నీతా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కులాలు, జాతుల గురించి ఆలోచించి వారి అభ్యున్నతికి కృషి చేసే ఒకే ఒక్క నాయకుడు సిఎం కెసిఆర్ అని హరీశ్ అన్నారు. నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడని, చివరకు అంద రూ కలిసి ఆయన్ని బ్యాన్ చేశారన్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నప్పటికీ సిఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు. సంక్షేమం కోసం ప్రత్యే క పథకం తీసుకు రావాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పట్టుపట్టి ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు రూ .60 కోట్లతో ఎరుకల సాధికారిక పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఎరుకల కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. విద్యా వైద్యంలో 10 శాతం రిజర్వేషన్ వల్ల ఇంజనీరింగ్, వైద్య కళాశాలలో రాణిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్లే ఉన్నత చదువుల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా హరీశ్‌రావు తెలిపారు.
అట్టడుగు వర్గానికి చెందిన ఎరుకల కులానికి చెం దిన మాజీ ఎంఎల్‌ఎ సత్యనారాయణ ఎంఎల్‌సిగా చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయిం చి ప్రతిపాదనలు పంపినప్పటికీ గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బిజెపి నాయకులు సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎరుకల జాతి నుంచి ఎంఎల్‌ఎగా గెలవాలంటే కష్టంగా ఉందని అందుకే ఎమ్మెల్సీగా తీసుకున్నామన్నారు. ఎరుకల జాతిలో నామినేటెడ్ ఎంఎల్‌సిగా అవకాశం ఇస్తే గవర్న ర్ తిరస్కరించడం వారిని అమానించడమేనన్నారు. ప్రాథమికంగా ప్రభుత్వ భూ ములు ఇచ్చి ఆర్థిక సాయం అందించి సొసైటీలుగా అవకాశం కల్పిస్తామన్నారు. ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరుకల సాధికారత పథకం మొట్టమొదటిగా మెదక్ జిల్లాలో అమలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.గిరిజన సంక్షేమ కార్యదర్శి , డా. క్రిస్టినా జెడ్. చోంగ్తు , జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, క్షేక్టర్, అదనపు కలెక్టర్, మాజీ ఎరుకల సంఘం నాయకులు తదితరులున్నారు.