Sunday, December 22, 2024

యువతకు కేంద్రం ద్రోహం

- Advertisement -
- Advertisement -

ఆర్మీ ఉద్యోగార్థులను అంధకారంలోకి నెట్టిన అనాలోచిత నిర్ణయం
అగ్నిపథ్ పథకం అభాసుపాలు సికింద్రాబాద్ ఘటన బాధాకరం : ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు

మన తెలంగాణ/వేల్పూర్: అగ్నిపథ్‌తో దేశ యువతను అంధకారంలోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందని, దేశం కోసం సేవచేసే ఆర్మీ జవాన్లపై కూడా బిజెపి రాజకీయాలు చేయడం దారుణమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. త్రివిధ దళాల్లో చేరే యువతను పక్కదారి పట్టించే అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చి అన్యాయం చేసింది. శనివారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కృషిచేస్తుంటే, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అభాసుపాలైందన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. బిజెపి నాయకులు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ సికింద్రాబాద్ ఘటనను టిఆర్‌ఎస్ పార్టీ కుట్ర అని అంటున్నారని, మరి ఉత్తరప్రదేశ్, పం జాబ్‌లో పోలీస్‌స్టేషన్లు దగ్ధం సంఘటనలు ఎలా జరిగాయని ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, నీ తిష్ కుమార్‌లు చేయించారా అని హరీశ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఘటన బాధాకరమని, అగ్నిపథ్ పాలసీపై భగ్గుమన్న యువతను అర్థం చేసుకోకపోవడం కేంద్రం మొండివైఖరికి నిదర్శనమన్నారు.

ఈ ఘటనలో వరంగల్‌కు చెందిన యువకుడు రాకేశ్ మృతి మరికొంతమందికి తీవ్రగాయాలు కావడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు బిజెపి ఇచ్చిన మాట ప్రకారం నల్ల డబ్బు జన్‌థన్ అకౌంట్‌లో ప్రజలకు వేయలేదని, ఎనిమిదేళ్లయినా కేంద్రంలో అధికారంలో ఉండి ఒక్కరికీ ఒక్క రూపాయి వేయలేదన్నారు. ఎపిలో పో లవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వడంలేదని ధ్వజమెత్తా రు. నల్ల చట్టాలపై దీక్షలో కూర్చొన్న రైతుల ప్రాణాలు అధికారంలోకి వస్తే ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 8ఏళ్లలో 2 కోట్ల చొప్పున 16 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని డిమాం డ్ చేశారు. ప్రజలకు ఇచ్చినమాట నిలబెట్టుకునేది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. రైతులకు సిఎం కెసిఆర్ ఏటా ఎకరానికి రూ.10వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నారని, దళిత బంధు కార్యక్రమం దశలవారీగా ప్రతి దళిత కుటుంబానికి అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు.

బిజెపి మాటలు మాత్రమేగాని చేతలు చేదుగా ఉంటాయని దెప్పిపొడిచారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని చెబుతున్నారని, 24గంటలు ఉచిత కరెంటు టిఆర్‌ఎస్ ప్రభుత్వమే అందిస్తుందన్నారు. ఏ రాష్ట్రంలోలేని కార్యక్రమాలు తెలంగాణలో సిఎం కెసిఆర్ చేపడుతున్నారని, రైతులు, పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి హరీష్ పేర్కొన్నారు. వేల్పూర్ మం డలం మోతె గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, బైపాస్‌రోడ్డుకు మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. వేల్పూర్‌కు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి హరీష్‌రావుకు రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందరర్బంగా మోతె గ్రామం లో రూ. కోటి 30లక్షల వ్యయం తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News