Monday, December 23, 2024

దాని తరువాత బిజెపికి ఆదరణ పెరిగింది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత బిజెపికి ఆదరణ పెరిగిందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రచార రథాలను గ్రామాల్లోకి రానివ్వడంలేదని మండిపడ్డారు. కొన్ని సర్వే సంస్థలు దొంగ లెక్కలు చెబుతున్నాయని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వల్ల తెలంగాణ నష్టపోయిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో అమలు చేశారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ హయాంలో జరిగిన అవినీతిపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. తెలంగాణను బిఆర్‌ఎస్ ఆర్థికంగా వెనకబడేలా చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ప్రజల మీద బస్మాసురా హస్తమే కనిపిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News