Friday, December 20, 2024

నా పక్కకొచ్చి నిల్చో లేడీ జర్నలిస్టుపై బిజెపి నేత అసహనం

- Advertisement -
- Advertisement -

చెన్నై : ప్రశ్నించొద్దు … చెప్పేది విను అనే తరహాలో తమిళనాడులో అక్కడి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై వ్యవహరించాడు. సోమవారం విలేకరుల సమావేశం జరుగుతోంది. తమిళనాడులో రాజకీయ పరిణామాలపై విలేకరులు ప్రశ్నలు వేస్తూ వచ్చారు. అన్నాడిఎంకె, బిజెపి బంధం ఎందుకు తెగిందనేది కీలక అంశం అయింది. ఈ దశలో ఓ మహిళా జర్నలిస్టు బిజెపి నేత అన్నామలైని ఉద్ధేశించి ‘మీరు బిజెపి రాష్ట్రా స్థాయి అధ్యక్షుడు కాకుండా ఉంటే, బిజెపిలోనే ఉంటారా? అని ప్రశ్నించారు. దీనితో ఒక్క సారి ఆగ్రహంతో ఆయన అసహనంతో చూస్తూ ‘నువ్వు నా పక్కకు వచ్చి నిలుచో. అప్పుడు ఈ ప్రశ్న వేసిన వారెవ్వరు అనేది అందరికీ తెలుస్తుంది…ఇటు పక్కకు రా’ అని గద్దించడం వివాదానికి దారితీసింది. మహిళా జర్నలిస్టు పట్ల బిజెపి నేత ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందని విమర్శలు తలెత్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News