Monday, January 20, 2025

కాంగ్రెస్‌వి బుజ్జగింపు రాజకీయాలు : బీజేపీ అధ్యక్షుడు నడ్డా విమర్శ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు సాగిస్తూ , సమాజం లోని అత్యధిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్ 50 శాతం వరకు పెంచుతామని హామీ ప్రకటించడం ఎవరికి ప్రయోజనం కలిగిస్తుందో స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ను నిలదీశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లింలీగ్ మేనిఫెస్టోలా ఉందని, స్వాతంత్య్రం రాకముందు పాకిస్థాన్ కోసం సాగిన ఉద్యమం నాటి పరిస్థితులు కల్పిస్తుందని ప్రధాని మోడీ చేసిన విమర్శకు మద్దతు పలికారు. ప్రజలు అదేపనిగా తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని , అదికారంపై ఉన్న అత్యాశతో దేశాన్ని విడదీస్తోందని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News