Saturday, December 21, 2024

రాహుల్ కు వ్యతిరేకంగా బిజెపి ఒత్తిడి చేసింది: రాజారత్నం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని తనపై బిజెపి ఒత్తిడి తెచ్చిందని అంబేడ్కర్ మునిమనుమడు రాజారత్నం అంబేడ్కర్ పేర్కొన్నారు. అయితే దీనిని బిజెపి నేతలు ఖండించారు. రాజారత్నం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేశారు.

తాను ఎలాంటి నిరసనలు తెలపాలని అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. తనను ఆదేశించే హక్కు బిజెపికి లేదన్నారు. నాకు బిజెపి, కాంగ్రెస్ రెండూ ఒకటేనన్నారు. ఏ అంశాలపై ఆందోళనలు చేయాలన్నది తన వ్యక్తిగత విషయం అన్నారు. ఆయన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News