Monday, January 20, 2025

ఉద్యోగాల హామీతో బిజెపి తప్పుదోవ పట్టిస్తోంది

- Advertisement -
- Advertisement -

ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పనకు బిజెపి వాగ్దానం
అబద్ధాలు చెప్పారా అని ఆ పార్టీని నిలదీస్తున్న యువత
‘యువ న్యాయ్’తో ఉద్యోగాల విప్లవం
రాహుల్ గాంధీ ప్రకటన

న్యూఢిల్లీ : ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానంతో ప్రజలను భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘తప్పుదోవ పట్టిస్తోంది’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. బిజెపి తమకు అబద్ధాలు చెప్పిందా అని దేశవ్యాప్తంగా యువత ఆ పార్టీని ప్రశ్నిస్తున్నట్లు రాహుల్ ’ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. బిజెపి సృష్టించిన భ్రమ గూడును ఛేదించడం ద్వారా యువత తమ భవితను తామే తీర్చిదిద్దుకోవలసి ఉంటుందని కూడా రాహుల్ సూచించారు. ఎన్నికలకు ముందు యువతకు కాంగ్రెస్ చేసిన వాగ్దానం ‘యువ న్యాయ్’ ద్వారా ఉద్యోగాల విప్లవాన్ని చేపట్టాలని పార్టీ తీర్మానించినట్లు ఆయన తెలియజేశారు.

‘నరేంద్ర మోడీజీ ! ఉపాధి కల్పన విషయమై మీకు ఏదైనా ప్లాన్ ఉన్నదా? ప్రతి యువత పెదవులపై ఇప్పుడు నానుతున్న ప్రశ్న ఇది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే అబద్ధాన్ని ఎందుకు చెప్పారని ప్రతి వీధిలో, గ్రామంలో బిజెపిని ప్రజలు అడుగుతున్నారు’ అని రాహుల్ తెలియజేశారు. ‘యువ న్యాయ్ కింద ఉద్యోగాల విప్లవం చేపట్టాలని కాంగ్రెస్ తీర్మానించింది. మేము అధికారంలోకి రాగానే చేసే పని అదే అన్నది మా గ్యారంటీ. మేము 30 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. ప్రతి విద్యాధిక యువకునికకకి‘పెహ్లీ నౌకరీ పక్కీ’ పథకం కింద ఏటా లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని ప్రతి యువకునికి ఇస్తాం. చట్టం చేయడం ద్వారా పరీక్ష పత్రాల లీక్‌కు స్వస్తి పలుకుతాం’ అని రాహుల్ గాంధీ తెలియజేశారు.

నిరుద్యోగితపై బిజెపి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లక్షం చేసుకున్నది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగితను ఒక అంశం చేయాలని కాంగ్రెస్ అనుకుంటున్నది. ‘రెండు సిద్ధాంతాల మధ్య అంతరాన్ని గుర్తించేందుకు ఇదే తరుణం. యువత భవిత నిర్మాణాన్ని కాంగ్రెస్ కోరుకుంటుండగా, బిజెపి వారిని తప్పు దోవ పట్టించాలని అనుకుంటున్నది. భ్రమ గూడును ఛేదించడం ద్వారా తమ సొంత చేతులతో తమ భవితను యువత తీర్చిదిద్దుకోవలసి ఉంటుంది.‘ఉద్యోగాల విప్లవాన్ని’ దేశంలో తీసుకురావలసి ఉంటుంది’ అని రాహుల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News