జైపుర్: రాజస్థాన్‌లో ‘లంపీ స్కిన్’ వ్యాధితో 50000లకు పైగా ఆవులు మరణించిన నేపథ్యంలో బిజెపి భారీ ఎత్తున నిరసనల ప్రదర్శన చేపట్టింది. బిజెపి చెందిన పుష్కర్ నియోజక వర్గం ఎంఎల్‌ఏ సురేశ్ సింగ్ రావత్ అయితే తన వెంట ఓ ఆవును తీసుకుని సోమవారం శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. మీడియా చట్టుముట్టడంతో భయపడ్ద ఆవు ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. ఎంఎల్‌ఏ అనుచరులు దానిని పట్టుకునేందుకు వెంటపడ్డారు. ఓ ముగ్గురు శాసనసభ్యులు విధానసభలో బైఠాయించి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. వ్యాధి బారిన పడి పశువులు చనిపోతుంటే ప్రభుత్వం చేతగాని స్థితిలో నిశ్చేష్టంగా ఉందని అనేక మంది విమర్శిస్తున్నారు.
Big BJP protest in Jaipur over lumpy skin disease that has killed over 50,000 cattle in Rajasthan#LumpySkinDisease #LumpyVirus pic.twitter.com/vyyfwW8qjK
— The Times Of India (@timesofindia) September 20, 2022