Monday, December 23, 2024

ఖమ్మం బహిరంగ సభకు రంగం సిద్దం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం బహిరంగ సభకు రంగం సిద్దం
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీల నియామకం
జన సమీకరణపై దృష్టి సారించిన బీజేపీ
నేతలను రంగంలోకి దించిన బండి సంజయ్
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జన సమీకరణపై చర్చించిన నేతలు

హైదరాబాద్: ఈనెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం రానున్న నేపథ్యంలో పట్టణంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానంలో భారీ ఎత్తున నిర్వహించబోయే బహిరంగ సభకు జన సమీకరణపై బీజేపీ దృష్టి సారించింది. కనీవినీ ఎరగని రీతిలో లక్ష మందికి తగ్గకుండా జనాన్ని సమీకరించి సభను సక్సెస్ చేయాలని నిర్ణయించింది. అందుకోసం ఉమ్మడి జిల్లాలోని గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను సభకు ఆహ్వానించేందుకు సిద్ధమైంది. అందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను నియమించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయా ఇంఛార్జీలతో బండి సంజయ్ సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మాజీమంత్రి డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గడీల శ్రీకాంత్ రెడ్డి, ఎర్రం మహేశ్, పుల్లారావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సమావేశానికి హాజరైన పలువురు నేతలు మాట్లాడుతూ అమిత్ షా సభకు విచ్చేసేందుకు యువత స్వచ్ఛందగా వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే పినపాకసహా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సొంతంగా వాహనాల్లో తరలివస్తామని ఫోన్లు చేస్తున్నట్లు తెలిపారు. లక్ష మందికి తగ్గకుండా జనాన్ని సమీకరించాలని నిర్ణయించిన నేపథ్యలో ఉమ్మడి జిల్లాలోని 47 మండలాలు, 3 మున్సిపాలిటీలతోపాటు ఖమ్మం కార్పొరేషన్ వారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రేపటి నుండి నియోజకవర్గ ఇంఛార్జీలు బాధ్యత తీసుకున్న నియోజకవర్గాల్లోనే మకాం వేసి పోలింగ్ బూత్ ల వారీగా సమావేశం నిర్వహించాలని ్‌ఆదేశించారు. దీంతోపాటు వివిధ మోర్చాల నేతలు సైతం ఆయా సంఘాలు, కులాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై బహిరంగ సభకు ఆహ్వానించాలని కోరారు. మహిళా మోర్చా నేతలు ఖమ్మం జిల్లాలో మకాం వేసి ఇంటింటికీ వెళ్లి సభకు హాజరయ్యేలా ఆహ్వానించాలని సూచించారు. కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయడం ద్వారా ఖమ్మం జిల్లాలో బీజేపీ దమ్ము చూపుదామని చెప్పారు. బండి సంజయ్ ఆదేశాల నేపథ్యంలో సమావేశం ముగిసిన వెంటనే ఆయా నియోజకవర్గాల ఇంఛార్జీలు ఖమ్మం జిల్లాకు బయలుదేరి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News