Wednesday, January 22, 2025

బిజెపి ఫేక్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

కాషాయ పార్టీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎండగట్టాలి

అన్ని వర్గాల ప్రజలను
సంక్షోభంలోకి నెట్టింది
బిజెపినే ప్రజల్లోకి
టిఆర్‌ఎస్ సంక్షేమ
పథకాలు పనిచేసే
ప్రతి కార్యకర్తకు
సముచిత స్థానం
సిద్దిపేట పర్యటనలో
వైద్యారోగ్య శాఖ
మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: బిజెపి ఫేక్ సో షల్ మీడియాను ఎండగట్టి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం టిఆర్‌ఎస్‌వి జిల్లా అ ధ్యక్షుడు మెరుగు మహేశ్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌విలో కొత్తగా చేరే విద్యార్థుల స్వాగత వాల్ పోస్టర్ల ను మంత్రి ఆవిష్కరించారు. సిద్దిపేటలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచితస్థానం ఉంటుందని, ఉద్యమంలో యువకులు, విద్యార్థుల పాత్ర గొప్పదన్నారు. అదేవిధంగా తెలంగాణకు కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ఆన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వ చ్చాక విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు బిసి స్టడీ సర్కిల్‌లో గ్రూప్-1, గ్రూప్-2, ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. కష్టపడి చదవి ఉన్నతస్థాయిలో నిలవాలని అభిలాషించారు. తలవంచి చదవి.. తలెత్తుకునేలా జీవించండని సూచించారు.

గ్లోబలైజేషన్‌లో ప్రపంచం చిన్నగా మారిపోయిందని, ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు నిరుత్యాహపడకుండా ఎక్కడ అవకాశాలుంటే వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఇక్కడ బిసి స్టడీ సర్కిల్‌లో పొందిన 308మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక వైద్య విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం జిల్లాకో మెడికల్ కాలేజ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. 70ఏళ్ల జాతీయ పార్టీల ఏలుబడిలో సమైక్య రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు ఉంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 7 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామంటే సిఎం కెసిఆర్ సాధించిన ఘనతకు నిదర్శనమన్నారు. ఒక వైపు వైద్య విద్య, మరో వైపు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సిఎం కెసిఆర్ వైద్య విద్యను ప్రోత్సహించే ఆలోచన చేశారన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే.. దేశంలోని అన్నివర్గాల ప్రజలను సంక్షోభంలో పడేసింది బిజెపినేనన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులు.. పార్టీకి భవిష్యత్ సారథులు మీరేనని విద్యార్థులకు సూచించారు. టిఆర్‌ఎస్ ప్రజా సంక్షేమ ప్రభుత్వమని.. బిజెపి చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థులకు మంత్రి సూచించారు.

దేశ పురోగతిలో రూపాయి విలువ తగ్గిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 8ఏళ్లలో దేశానికి బిజెపి చేసింది ఏమి లేదన్నారు. మత కల్లోలాలు, హింస తప్ప దేశంలో గుణాత్మక మార్పు ఏమీ లేదన్నారు. బిజెపి అంటే అబద్ధాల పార్టీ అని ఎద్దేవా చేశారు. ఉన్న ఉద్యోగాలను ఉడగొట్టిన ఘనత బిజెపిదేనన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలను, అభివృద్ధ్ది సంక్షేమ కార్యక్రమాలను కేంద్రంలోని నీతి అయోగ్ అభినందించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌వి నాయకులు రాచకొండ భిక్షపతి, రెడ్డి యాదగిరి, భూక్య భిక్షపతి నాయక్, నాళ్లపురం రాంమోహన్, నాగుల ప్రశాంత్ గౌడ్, చేపూరి శేఖర్ గౌడ్ వివిధ మండలాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, సోషల్ మీడియా ఇంచార్జ్జిలు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News