Monday, December 23, 2024

షిండేతో శరద్ పవార్ భేటీ వ్యక్తిగతమే: బిజెపి

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం వెనుక ఉద్దేశం ఏమిటో ఇంకా తెలియనప్పటికీ ఇది రాజకీయ సమావేశం కాదని, వ్యక్తిగత భేటీ మాత్రమేనని షిండే నేతృత్వంలోని శివపేన వర్గం మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. ‘నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు శరద్‌పవార్ సాహెబ్ ఈ రోజు ప్రభుత్వ అధికార నివాసం వర్షను సందర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు’ అని షిండే ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

తమ భేటీకి సంబంధించిన రెండు వీడియోలను కూడా ఆయన దానితో పాటు పంచుకున్నారు. కాగా ఈ సమావేశం జరిగిన కొద్ది సేపటికే బిజెపి నాయకుడు, రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ పవార్, షిండేల మధ్య సమావేశం కేవలం వ్యక్తిగత భేటీ మాత్రమేనని, దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News