Thursday, January 23, 2025

రూటు మారినా చేరే చోటు ఒక్కటే

- Advertisement -
- Advertisement -

 

BJP received more corporate donations

కార్పొరేట్‌ విరాళాల్లో బిజెపికే పెద్ద వాటా
ఎలక్టోరల్ ట్రస్టుల జమ రూ 258 కోట్లు
ఇందులో కమలం ఖాతాలో రూ 212 కోట్లు
గుండుగుత్తగా మొత్తం 82 శాతం సొమ్ము
కాంగ్రెస్ ఇతర పార్టీలకు 46 కోట్లు

న్యూఢిల్లీ : దేశంలోని రాజకీయపార్టీలలో బిజెపికే అత్యధిక విరాళాలు అందాయి. ఏడు ఎలక్టోరల్ ట్రస్టులకు కలిపితే మొత్తం మీద రూ 258. 49 కోట్లు దక్కాయి. ఇందులో అత్యధికంగా బిజెపి ఇందులో సగానికి బాగా పైగా అంటే దాదాపు 82 శాతం వరకూ పొందింది. ఈ అంశాన్ని ఎన్నికల హక్కుల వేదిక ఎడిఆర్ తమ విశ్లేషణల క్రమంలో తెలిపింది. దేశంలో రాజకీయ పార్టీలకు తగు రీతిలో విరాళాల కోటాలను అందించేందుకు ఎలక్టోరల్ ట్రస్టులు ఏర్పాటు అయ్యాయి. ఈ ట్రస్టులకు వివిధ కార్పొరేటు ట్రస్టులు , వ్యక్తుల నుంచి విరివిగానే చందాలు అందుతున్నాయి. వీటిని ట్రస్టులు రాజకీయ పార్టీలకు చేరవేస్తోంది. ఎన్నికల దశల వ్యయాలకు సంబంధించిన నిధుల వినియోగంలో సరైన పారదర్శకత పెంచడం ఈ ట్రస్టులు తమ లక్షంగా పెట్టుకున్నాయి. ఈ దిశలో వెలిసిన ఏడు ట్రస్టులు 2021 22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ల నుంచి వ్యక్తుల నుంచి అందిన విరాళాల వివరాలు అందించాయి. ఇవన్నీ కలిపితే ఈ మొత్తం విలువ రూ 258 కోట్లు దాటిందని వెల్లడైంది. ఇక బిజెపికి ఈ ట్రస్టుల ద్వారా అత్యధికంగా రూ 212 కోట్లు అందాయి.

ఇది మొత్తం విరాళాల కోటాలో 82 శాతం దాటింది. జెడియు రూ 27 కోట్లు పొంది మొత్తం వాటాలో దాదాపు 11 శాతం వరకూ నిధులు దక్కించుకుంది. ఇక కాంగ్రెస్, ఎన్‌సిపి, అన్నాడిఎంకె, డిఎంకె, ఆర్జేడి, ఆప్, ఎల్‌జెపి, సిపిఎం సిపిఐ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్‌కు కలిపితే రూ 19 కోట్లకు పైగా విరాళాలు ఈ ట్రస్టుల ద్వారా దక్కాయి. ఈ విధంగా కార్పొరేట్ల నుంచి ఈ విరాళాల మొత్తం అత్యధికంగా పరోక్షంగా అందుకున్న పార్టీ అధికార బిజెపియే అయింది. దేశవ్యాప్తంగా 23వరకూ నమోదిత ఎలక్టోరల్ ట్రస్టులు ఉన్నాయి. వీటిలో 14 వరకూ తమకు అందిన చందాలు వాటి పంపిణీ లెక్కలను ఎన్నికల సంఘానికి క్రమం తప్పకుండా చేరవేస్తోంది. ఇక మరో ఎనిమిది ట్రస్టులు తమకు ఏ విధమైన విరాళాలు అందలేదని తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 159 మంది ట్రస్టులకు విరాళాలు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News