Tuesday, November 26, 2024

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు… నలుగురు అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగనున్న అభ్యర్థుల నాలుగో జాబితాను బుధవారం బీజేపీ విడుదల చేసింది. మిగిలిన నాలుగు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చోటు దక్కలేదు. ఈ జాబితాతో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇప్పుడు ప్రకటించిన నాలుగు స్థానాలు అన్‌రిజర్వుడు కేటగిరికి చెందినవి.

ఈ నాలుగు స్థానాలకు బీజేపీ కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించింది. బెల్టారా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎ రజినీష్ సింగ్‌కు టిక్కెట్ దక్కలేదు. ఈ నియోజక వర్గం నుంచి 40 ఏళ్ల సుషాంత్ శుక్లా బీజేపీ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. రాష్ట్ర యూత్ కమిషన్ మాజీ సభ్యుడు శుక్లా, రాష్ట్ర బీజేపీ యువమోర్చా కో ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నారు.

అలాగే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంబికాపూర్ స్థానానికి రాజేష్ అగర్వాల్ అభ్యర్థిగా పోటీకి దిగారు. సుర్గుజ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన అగర్వాల్ వ్యాపార వేత్త. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. మిగతా ఇద్దరు అభ్యర్థులు ధనిరామ్ ధివార్ (కసడోల్ స్థానం), దీపేష్ సాహు (బెమెతారా స్థానం). మొత్తం 90 మంది బీజేపీ అభ్యర్థుల్లో 33 ఒబీసీ, 30 మంది ఎస్‌టి, 10 మంది ఎస్‌సి, ఉన్నారు. 13 సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎల్లో ఇద్దరికి ఈసారి టికెట్ దక్కలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News