హైదరాబాద్: యుపిఎ ప్రభుత్వ హయాంలో పాల్పడిన అవినీతిపై బిజెపి ఆదివారం ‘కాంగ్రెస్ ఫైల్స్’ పేరిట ఓ వీడియోను విడుదల చేసింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వివరించింది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ బిజెపి పోస్ట్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ మొదటి ఎపిసోడ్ దాని పాలనలో ఒకదాని తర్వాత ఒకటి అవినీతి, కుంభకోణాలు ఎలా జరిగాయో చూడండి’ అని ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వివరిస్తూ మూడు నిమిషాల వీడియోను విడుదల చేసింది. ప్రజల కష్టార్జితం రూ.4.80 లక్షల కోటను కాంగ్రెస్ దోచుకుందని ఆరోపిం చింది. ఆ సొమ్ముతో దేశభద్రత నుంచి ఎన్నో అభివృద్ధి పనులు అనేక పథకాలను పూర్తి చేయొచ్చని పేర్కొంది. ఇందులో కాంగ్రెస్ అంటే అవినీతి’ అని పేర్కొంది. అది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా. ముందుందని తెలిపింది. కాంగ్రెస్ అవినీతి భారాన్ని దేశం మోయాల్సి వస్తుందని విమర్శలు గుప్పించింది.
Congress Files के पहले एपिसोड में देखिए, कैसे कांग्रेस राज में एक के बाद एक भ्रष्टाचार और घोटाले हुए… pic.twitter.com/vAZ7BDZtFi
— BJP (@BJP4India) April 2, 2023