Monday, December 23, 2024

గోవాలో మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

- Advertisement -
- Advertisement -

BJP released six candidate in goa

 

న్యూఢిల్లీ : గోవాలో మిగిలిన ఆరు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆమేరకు ఆరుగురు అభ్యర్థుల పేర్లతో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. దాంతో గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది. గతం లోనే 34 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఆరు స్థానాల్లో గోవా మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు రెండు ఆప్షన్లు పార్టీ ఇచ్చినా తాను కోరిన పనాజీ కాకుండా వేరే స్థానాలను ఆఫర్ చేయడంతో నిరాశకు లోనై ఉత్పల్ బీజేపీని వీడి స్వతంత్ర ఆభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. దీంతో మిగిలిన ఆరు స్థానాలకు బీజేపీ బుధవారం అభ్యర్థులను ఖరారు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News