- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం మరి తొమ్మది మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 70 మంది సభ్యులుండే ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో శిఖా రాయ్‌ను గ్రేటర్ కైలాష్ నుంచి, అనీల్ వశిష్ఠ్ ను బాబర్‌పూర్ నుంచి బిజెపి బరిలో నిలబెట్టింది. కాగా శిఖా రాయ్, ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్‌తో తలపడనుండగా, అనీల్ వశిష్ఠ్ ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గోపాల్ రాయ్‌తో పోటీపడనున్నారు. ఈ తాజా జాబితాతో బిజెపి ఇప్పటి వరకు 68 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాగా మిగతా సీట్లను తన మిత్రపక్షాలకు ఇవ్వాలనుకుంటోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్లుగా సాగిస్తున్న పాలనకు ముగింపు పలకాలని బిజెపి శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగనుండగా, ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.
- Advertisement -