Sunday, January 19, 2025

నేడు బిజెపి నాలుగో జాబితా.. అభ్యర్థుల లిస్ట్ ఫైనల్..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆదివారం నాలుగో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, బెంగాల్ లో పోటీ చేసే అభ్యర్థులను సీఈసీ ఫైనల్ చేసింది. శనివారం అర్థరాత్రి వరకు బీజేపీ సీఈసీ మీటింగ్ కొనసాగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తదితరులు సీఈసీ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఎపిలో బిజెపి పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. అటు తెలంగాణ బిజెపి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ హాజరుకానున్నారు. రానున్న ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News