Thursday, January 23, 2025

జార్ఖండ్ మేనిఫెస్టోను విడుదల చేసిన బిజెపి

- Advertisement -
- Advertisement -

రాంచీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం బిజెపి ‘సంకల్ప్ పత్ర’ (మేనిఫోస్టో)ను విడుదల చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ముప్పులో ఉన్న ‘మాటి, బేటి, రోటి’ సురక్షితంగా ఉండేలా చూస్తామన్నారు. జార్ఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ‘పేపర్ లీక్స్’ అంశంలో సిబై, సిట్ దర్యాప్తులు చేపడతామని కూడా హామీ ఇచ్చారు.

కాషాయ పార్టీ 5 లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. ఆయన జెఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్నివిమర్శిస్తూ హిందువుల రాష్ట్రంలో దాడులకు గురవుతున్నారని, హేమంత్ సోరెన్ ప్రభుత్వం చాలా అవినీతి ప్రభుత్వం అని అన్నారు.

‘‘నువ్వు(హేమంత్ సోరెన్) చొరబాటుదారులకు ఆశ్రయం ఇచ్చావు. చొరబాటుదారులను నీ ఓటు బ్యాంకుగా చూస్తున్నావు. చొరబాటుదారుల కారణంగా ఈ రాష్ట్రంలో గిరిజనులు తగ్గిపోతున్నారు. జనాభా నిష్పత్తి మారిపోతోంది. ఒకవేళ బిజెపి అధికారంలోకి వస్తే జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను ఏరిపారేస్తాను. అస్సాంలో బిజెపి అధికారంలోకి రాగానే అక్కడ చొరబాటులకు చెక్ పడింది. మేము మూడు అంశాలు- రోటి, బేటి, మాటి(నేల)ను సంరక్షిస్తాం’’ అని అమిత్ షా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News