Wednesday, January 22, 2025

మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు.. 21 మందితో బిజెపి జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మిజోరాం లోని 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్న 21 మంది అభ్యర్థుల జాబితాను బిజెపి బుధవారం విడుదల చేసింది. నవంబర్ 7న ఈ ఎన్నికలు జరగనున్నాయి. చత్తీస్‌గఢ్ లోని పండరీయ అసెంబ్లీ స్థానానికి భావన బోహ్రా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీజేపీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ పోలింగ్ నవంబర్ 7 , 17 తేదీల్లో రెండు దశల్లో జరుగుతుంది. మిజోరాం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల్లో లుంగ్లేయి పశ్చిమ స్థానానికి ఆర్.

లాల్ బియక్త్ యాంగీ పోటీ చేస్తారు. థొరాంగ్ నుంచి శాంతి బికాస్ చక్మా, హెచ్చెక్ నుంచి మల్సావిల్ తులంగా, డంపా స్థానం నుంచి వన్‌లాల్ ముయకా తదితర అభ్యర్థులు 12 మంది ఈ జాబితా లో ఉన్నారు. ఇక రెండో జాబితాలో తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. రెండో జాబితాలో తొమ్మిది మంది ఉన్నారు. తుల్‌వావీ స్థానం నుంచి జుడీ జొహిమింగ్లియన్, ఎఫ్ లాల్రేమ్‌సంగి అయిజ్వాల్ దక్షిణ 1 స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సెర్చిప్ స్థానం నుంచి కె వనియల్య్రాతి పోటీ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News