Wednesday, January 22, 2025

ఉమాభారతిని మరిచిన బిజెపి

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 40 మంది ప్రముఖ ప్రచారకర్తల పేర్లతో బిజెపి శుక్రవారం ఓ జాబితా విడుదల చేసింది. ఈ స్టార్ కంపైనర్ల లిస్టులో ప్రధాని మోడీ, అమిత్ షా, యుపి సిఎం ఆదిత్యానాధ్ వంటి వారి పేర్లున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి, ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన ఉమాభారతి పేరు ఇందులో చేర్చలేదు. స్టార్‌కాంపైనర్ల లిస్టులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ , దేవెంద్ర ఫడ్నవిస్, మనోజ్ తివారీ వంటి వారు చోటుచేసుకున్నారు. కాగా తనపేరు ఈ జాబితాలో లేకపోవడంపై ఉమాభారతి టికమ్‌ఘర్‌లో స్పందించారు. సిఎం చౌహాన్ తరఫున ప్రచారం చేసేందుకు తనకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని చమత్కరించారు. పార్టీకోసం సిఎం మరింతగా తన సేవలు తీసుకోవచ్చునని, ఆయన ఇష్టానికి దీనిని వదిలిపెడుతున్నానని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News