Friday, November 22, 2024

పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటకలో బిజెపి సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)ని అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ సిఫార్సుల ఆధారంగా యుసిసి అమలుచేస్తామని తెలిపింది. అదేవిధంగా కర్ణాటకలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)ని ప్రవేశపెడతామని తద్వారా హూక్షుకమ వలసదారులను వారి దేశాలకు పంపివేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.ఉమ్మడి పౌరస్మృతికి భారత రాజ్యాంగం అనుమతిస్తోందన్నారు.

ఎవరిని అనునయించడం తమ విధానం కాదని అందరికీ న్యాయం జరగాలన్నదే తమ విధానమని మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అన్నారు. ఉగ్రవాదం, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా స్టేట్ వింగ్ ఎగినెస్ట్ రెలిజియస్ ఫండమెంటలిజం అండ్ టెర్రర్ (కెఎస్‌డబ్లూఐఎఫ్‌టి) పేరుతో ఓ ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేయనున్నట్లు బిజెపి మేనిఫెస్టోలో పేర్కొంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఉగాది, వినాయకచవితి, దీపావళి పండుగలను పురస్కరించుకుని వంట గ్యాస్ సిలిండర్లును ఉచితంగా అందిస్తామని కమలంపార్టీ తెలిపింది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని అన్ని వార్డులలో ‘అటల్ ఆహార కేంద్ర’

ఏర్పాటు చేసి నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పోషణ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలకు ప్రతిరోజు అరలీటరు నందిని పాలు, ప్రతినెల ఐదు కేజీల సిరిధాన్యాల కిట్లు ఉచితంగా అందిస్తామని ఎన్నికల హామీపత్రంలో బిజెపి తెలిపింది. సొంతగృహంలేనివారిని రెవెన్యూ డిపార్టుమెంటు ద్వారా గుర్తించి పది లక్షల నివాస స్థలాలను సర్వరిగు సురు యోజన పథకం కింద అందజేస్తామని బిజెపి చీఫ్ నడ్డా వెల్లడించారు. తమ మేనిఫెస్టోలో ఆరు ‘ఎ’లకు ప్రాధాన్యమిచ్చినట్లు నడ్డా తెలిపారు. అన్న (ఆహార భద్రత), అక్షర (నాణ్యమైన విద్య), ఆరోగ్య (మెరుగైన ఆరోగ్యం), ఆదాయ (ఖచ్చితమైన ఆదాయం), అభయ (సామాజిక భద్రత), అభివృద్ధిగా నడ్డా పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాల మహిళలకు రూ.10వేలు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో అందజేస్తామని బిజెపి మేనిఫోస్టోలో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News