Monday, December 23, 2024

ఒకే ఒక అభ్యర్థితో బిజెపి రెండవ జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా మిథున్‌ కుమార్‌ రెడ్డి ప్రకటన

మన తెలంగాణ/ హైదరాబాద్: తనయుడు మిథున్‌ కుమార్‌ రెడ్డికి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కృషి ఫలించింది. శుక్రవారం మహబూబ్ నగర్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థిగా మిథున్‌ కుమార్ రెడ్డిని పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. కేవలం ఒక్కరితోనే పార్టీ రెండవ జాబితా విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి షాద్‌నగర్ టికెటు తన కుమారునికి కేటాయించాలని హై కమాండ్‌ను కోరుతున్నారు. దానికి పార్టీ ఆయనకు, కుమారుడికి రెండుచోట్ల ఇవ్వడం కుదరదని సీనియర్లు నుంచి సంకేతాలు రావడంతో కొడుకు కోసం తన సీటునే జితేందర్ రెడ్డి త్యాగం చేశారు. తనకంటే తన కొడుకు భవిష్యత్తే తనకు ముఖ్యమని ఆయన భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News