Monday, December 23, 2024

బిజెపి విభజన రాజకీయాలు దేశంలో మత హింసను పెంచుతున్నాయి

- Advertisement -
- Advertisement -

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి విభజన రాజకీయాలు దేశంలో మత హింసను పెంచుతున్నాయని, దింతో భారతదేశ లౌకికతత్వం ప్రమాదంలో పడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ తెలిపారు. మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటలు కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర 3 వ మహాసభలు చరిత్ర పుటల్లో నిలిచిపోవాలన్నారు. కమ్యూనిస్టు పార్టీ కి ఇప్పటికి ప్రజల్లో అభిమానం బలంగా వుందని, భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజలు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారని, ఈ మహాసభల ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకరావాలని అయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్, హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ లో సిపిఐ తెలంగాణ రాష్ట్ర 3 వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో నారాయణ తోపాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా, సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్యెల్యే కొండిగారి రాములు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ తదితరులు వేదిక పై ఆసీనులైనారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ద్వంసం చేస్తూ వైవిధ్యభరితమైన, సుసంపన్నమైన సంస్కృతీ సాంప్రదాయాలు కలిగిన భారతదేశాన్ని అఖండ హిందూ భారతదేశంగా మార్చే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందని దీనితోపాటు పాలకుల ఆర్థిక విధానాలు ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే దేశద్రోహం లేదా ఈడీ, సిబీఐ లచే కేసులు బనాయిస్తున్నారని అయన వాపోయారు. అసమానత, నిరుద్యోగం, వ్యవసాయ, కార్మిక వర్గాలలో అశాంతి పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కూడా ప్రజలకిచ్చిన హామీలను టిఆర్‌ఎస్ సర్కార్ నెరవేర్చడంలో ఫుర్తిగా విఫలమైందని, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో పేద ప్రజల భూములను పోలీసులతో ఉక్కుపాదం మోపి బలవంతంగా లాక్కుంటున్నారని అయన ఆరోపించారు. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు హైదరాబాద్ నగర శివార్లలో శంషాబాద్ పట్టణంలో జరిగే సిపిఐ తెలంగాణ రాష్ట్ర 3 వ మహాసభల సందర్బంగా సృజనాత్మక పద్ధతుల్లో ప్రచారం నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News