Sunday, January 19, 2025

బుధవారం బిజెపి మలి జాబితా?

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితా బుధవారం (6వ తేదీ) వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, మాజీ సిఎం బిఎస్ యడ్యూరప్ప సోమవారం ఇక్కడ తెలిపారు. అయితే ఆరోజున ఈ రెండో జాబితా సిద్ధం అవుతుందని చెప్పిన ఈ నేత అదే రోజు దీనిని ప్రకటిస్తారా? లేదా అనేది స్పష్టం చేయలేదు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా వెలువరించలేదు. అయితే ఈ నెల రెండవ తేదీనే బిజెపి తొలి అభ్యర్థుల జాబితా 195 మంది పేర్లతో వెలువరించింది. ఇక రెండో జాబితా కోసం పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. తాను బుధవారం దేశ రాజధానికి వెళ్లుతున్నట్లు యడ్యూరప్ప ఇక్కడ తెలిపారు. ఎల్లుండి ఢిల్లీలో పార్టీ నేతల సమావేశం ఉంది.

బుధవారమే రెండో జాబితా ఖరారు అయ్యే అవకాశం ఉందని విలేకరులకు ఆయన చెప్పారు. రెండో జాబితా అయినా ఏ జాబితా అయినా తుది నిర్ణయం పార్టీ జాతీయ స్థాయి నాయకులదే అని ఆయన తెలిపారు. కర్నాటకలో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ కొత్త వారికి స్థానం కల్పిస్తారా? లేక ఎక్కువగా పాత వారే ఉంటారా? అనే ప్రశ్నకు యడ్యూరప్ప జవాబివ్వలేదు. పార్టీ అగ్రనేతల మదిలో ఏముందనేది తనకు తెలియదని, అంతా వారే చూసుకుంటారని, తన పాత్ర కేవలం చర్చల ప్రక్రియలో పాలుపంచుకోవడమే అని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో మిత్రపక్షం జెడియుకు ఎన్ని స్థానాలు వదిలిపెడుతారనేది కూడా తనకు తెలియదన్నారు. ఈ విషయంలో జెడియు నేత దేవెగౌడ పార్టీతో సరైన ఒప్పందం కుదురుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News