Sunday, December 22, 2024

బిజెపి సీనియర్ల భేటీ

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షాల గెలుపు ధీమాపై విశ్లేషణ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్న తరుణంలో బిజెపి సీనియర్ నాయకులు సోమవారం నాడిక్కడ సమావేశమయ్యారు. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమికి భారీ విజయాన్ని సూచిస్తూ ఎగ్జిట్ పోల్స్ వెలువడడం, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పదవి నుంచి తప్పుకోవడం తథ్యమని ప్రకటిస్తూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రతిపక్ష ఇండియాకూటమి తిరస్కరిస్తూ వరుసగా సమావేశం కావడం నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని విశ్లేషించేందుకు బిజెపి నాయకులు సమావేశమైనట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంపై బిజెపి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రతిపక్షాల వాదనను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి చర్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాగా..ఆదివారం ఎన్నికల కమిషన్‌ను కలుసుకున్న బిజెపి నాయకులు ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కించపరచడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించాయి.

జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హిసకు, అశాంతికి చేసే ప్రయత్నాలను నిరోధించాలని ఇసిని బిజెపి నాయకులు కోరారు. అంతేగాక ఇవిఎంలకు చెందిన ఓట్ల లెక్కింపునకు ముందుగానే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి వాటి ఫలితాలను ప్రకటించాలని కూడా బిజెపి నాయకులు ఇసిని కోరారు. కౌంటింగ్ ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేయాలని, అవి అమలు జరిగేలా చూడాలని వారు ఇసిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News