Tuesday, January 21, 2025

బిజేపి హటావో సింగరేణి బచావో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇల్లందు: తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా వున్న సిరుతల్లి సింగరేణి సంస్ధను కాపాడుకోవాలంటే దేశం నుండి భాజాపాను ప్రారదోలాలని రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్ధిఖ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం స్ధానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియానాయక్ అధ్యక్షతన బొజ్జాయిగూడెంలోని ఎస్‌ఎస్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ముఖ్యఅతిధిగా పాల్గోని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయని అందుకు కారణం ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు.

అరువైఎళ్ళ కాలంపాటు పరిపాలించిన పార్టీలు చేయలేని అభివృద్ధిని కేవలం ఎనిమిదేళ్ళలో కేసిఆర్ చేసి చూపించారన్నారు. దేశ ప్రజలు కేసిఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని, అందులో భాగంగానే ఉద్యమపార్టీగా పుట్టిన తెరాస నేడు భారాసగా ఆవిర్భవించిందన్నారు. ఈ నెల 18వ తేదిన ఖమ్మం నగరంలో నిర్వహించబోయే భారాస భారీ బహిరంగసభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సిపిఐ, సిపిఐఎమ్ జాతీయ నాయకులు పాల్గోంటున్నారని అట్టి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌విప్ రేగా కాంతారావు, మాజీ ఎస్సీఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య, ఎమ్‌ఎల్‌సి తాతా మధుసూధన్, మహబుబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ బిందు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన్ జానీపాష, పలు మండలాల జెడ్పిటిసిలు, ఎమ్‌పిపిలు, ఎమ్‌పిటిసిలు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News