Sunday, January 19, 2025

ముంబై ఇండియా సదస్సు మతాలపై దాడికేనా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని జనబాహుళ్యపు మత మనోభావాలను దెబ్బతీసేందుకు, మతాలను కించపరిచేందుకే ప్రతిపక్షాలు ముంబైలో ఇండియా కూటమి భేటీ ఏర్పాటు చేసుకున్నాయా? అని బిజెపి విమర్శించింది. కేంద్ర మాజీ మంత్రి, బిజెపి అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ సోమవారం విలేకరుల సమావేశంల ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇండియా కూటమి వారు హిందువుల మనోభావాలతో ఆటాడుకోవద్దని హెచ్చరించారు. తమిళనాడు మంత్రి అయిన వ్యక్తి ఈ విధంగా హిందువులను కించపరిచే విధంగా మాట్లాడటం దారుణం, సిగ్గుచేటని స్పందించారు.

యువస్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం కూడా వంత పాడారని , ప్రస్తుత విషయంపై రాహుల్, మమత, నితీశ్, ఖర్గేలు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఈ విధంగా తెరవెనుక ఉండి అనుచిత మాటలకు దిగుతున్నారా? అని నిలదీశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా తాను సనాతన వాదిని అని చెప్పారని గుర్తు చేశారు. తట ప కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావత్ స్పందిస్తూ దేశంలో సనాతనధర్మాన్ని అంతమొందించే వ్యూహాలను ముంబై ఇండియా కూటమిలో సిద్ధం చేసుకున్నట్లుగా ఉందన్నారు. సనాతన ధర్మాన్ని మొఘలులు కానీ తరువాత బ్రిటిష్ వారు కానీ ఏమి చేయలేకపోయ్యారని, ఈ శక్తివంతమైన భావనలతో సయ్యాటలకు దిగవద్దని బిజెపి నేతలు హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News