Thursday, January 23, 2025

సింగర్ కెకె మృతిపై టిఎంసి, బిజెపిల మధ్య వార్..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ప్రఖ్యాత బహుభాషా సినీ గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్ (కెకె)మంగళవారం అర్థరాత్రి ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై రాజకీయ దుమారానికి దారితీసింది. కెకె మరణం అసహజమరణం కావడంతో అది వివాదానికి దారితీసింది. బిజెపి, కాంగ్రెస్‌లు కెకె మరణంపై పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ లోపాలతోనే ఆయన ఆకస్మిక మరణం పరిస్థితి ఏర్పడిందనే బిజెపి నేతలు వాదించారు. ఆయనకు తీవ్ర స్థాయి గుండెపోటు వచ్చిందని, ఇందుకు స్థానిక నిర్వహణాలోపాలే కారణమని బిజెపి విమర్శించింది.

ఈ వాదనను టిఎంసి తిప్పికొట్టింది. గాయకుడి విషాదమరణాన్ని కూడా బిజెపి తన రాజకీయ స్వార్థానికి వాడుకోవడం విచిత్రంగా ఉందని టిఎంసి తెలిపింది. మరో వైపు కెకె మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. మృతికి కారణాలు తెలియచేసే పోస్టుమార్టం నివేదిక ఇంకా తమకు అందాల్సి ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. కెకె బస చేసిన హోటల్ మేనేజర్, సిబ్బందితో పోలీసులు మాట్లాడారు. న్యూమార్కెట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌లో కెకె మరణంపై అసహజ మరణం పరిధిలో కేసు దాఖలు అయింది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. స్థానికంగా రెండు కాలేజీలలో రెండు షోలలో పాల్గొనేందుకు కెకె ఇక్కడికి వచ్చారు.

BJP Slams TMC Over Demises of Singer KK 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News