- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. శాసనసభ ఎన్నికలకు వంద రోజుల కార్యాచరణ ప్రకటించి.. పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతం చేసేందుకు బిజెపి నాయకత్వం కూడా సిద్ధమైంది. ఈ బాధ్యతలను నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కమలం పార్టీ నిర్ణయించింది.
- Advertisement -