- Advertisement -
బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణలు
న్యూఢిల్లీ : దేశంలో ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ రూ. 6300 కోట్లు ఖర్చు చేసిందని , బీజేపీ ఈ పని చేయకపోతే వివిధ ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధించాల్సిన అవసరం వచ్చేది కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం ఆరోపించారు. ప్రభుత్వాలను కూలదోయడంలో బీజేపీ సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించిన మరుసటి రోజు కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెరుగు, మజ్జిగ, తేనె, గోధుమలు, బియ్యం తదితరాలపై విధించిన జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ. 7500 కోట్ల ఆదాయం వస్తుంది. రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ఇప్పటివరకు రూ. 6300 కోట్లు ఖర్చుచేసింది. లేకపోతే ఈ ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధించాల్సి వచ్చేది కాదు. ప్రజలకు అధిక ధరల సెగ తగిలేది కాదు అని ట్విటర్‌లో ఆయన వ్యాఖ్యానించారు.
- Advertisement -