Wednesday, January 22, 2025

అద్వానీకి భారతరత్న అవార్డ్

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీకి ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న అవార్డు లభించింది. దేశాభివృద్ధిలో భారతీయ జనతాపార్టీకి జవజీవాలు ఊదడంలో అద్వానీ, మాజీ ప్రధాని వాజపేయి చేసిన కృషి అసామాన్యమైంది. అద్వానీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

కరాచీలో 1927 నవంబర్ 8న అద్వానీ జన్మించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం బొంబాయికి వలస వచ్చింది. అద్వానీ 1941లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ లో 1951లో చేరారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1970లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1989 వరకూ ఆయన నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. జనసంఘ్ 1977 ఎన్నికలకు ముందు జనతాపార్టీలో విలీనమైంది. 1977 సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీ గెలవడంతో అద్వానీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించిన నలుగురిలో అద్వానీ ఒకరు. పార్టీకి ఆయన మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అద్వానీ మొదటిసారిగా 1989లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడుసార్లు లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. 1998నుంచి 2004వరకూ ఆయన సుదీర్ఘకాలం హోంమంత్రిగా పనిచేశారు. లోక్ సభలోనూ చాలాకాలం ప్రతిపక్ష నేతగా కొనసాగారు.  2002నుంచి 2004వరకూ ఉపప్రధానిగా కొనసాగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News