Monday, January 20, 2025

‘ధరేం’ద్ర మోడీ!

- Advertisement -
- Advertisement -

బిజెపి అంటేనే బేచో జనతాకీ ప్రాపర్టీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా కార్పొరేటర్ సంస్థలకు విక్రయిస్తున్నారు. దేశ సంపదను లూటీ చేసే వారే మోడీకి అత్యంత సన్నిహితులు. ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునః ప్రారంభించాలని కేంద్రానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదు. రూ. 2500 కోట్లు ఇచ్చి కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు కొనుక్కోమని చెప్పారని ఆ పార్టీ ఎంఎల్‌ఎ చేసిన వ్యాఖ్యలు, అసలు స్వరూపాన్ని నిరూపిస్తున్నాయి.

పెట్రోల్, డీజెల్, వంటగ్యాస్ అత్యధిక ధరల్లో దేశాన్ని
ప్రపంచంలో నెం.1గా నిలబెట్టిన ఘనత మన ప్రధానిదే

ట్విటర్‌లో #ఆస్క్ కెటిఆర్ నెటిజన్లతో జరిపిన విస్తృత సంభాషణలో మంత్రి కెటిఆర్

బిజెపి అంటే బేచో జనతాకీ ప్రాపర్టీ

మన తెలంగాణ/ హైదరాబాద్ : పెట్రోల్ డీజిల్‌తో పాటు గ్యాస్ సిలెండర్ల అత్యధిక ధరల విషయంలో భారత దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మోడీ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. 2014లో రూ. 410 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం వెయ్యి రూపాయలకు చేరిందన్నారు. ఇది కేవలం మోడీ పరిపాలన వల్లనే సాధ్యం అయిందన్నారు. ఈ ఘనత మోడీకి తప్ప మరెవరికి దక్కదన్నారు. మోడీ పాలనలో ప్రజలకు లభిస్తున్న అచ్ఛేదిన్‌కు స్వాగతం పలుకుతున్నట్లు వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఆశించేది ఇంకేమి ఉంటుందని మండిపడ్డారు. ట్విటర్‌లో నెటిజన్లతో కెటిఆర్ సంభాషించారు. #askktr (ఆస్క్ కెటిఆర్) పేరుతో జరిగిన ఈ సంభాషణలో అనేక అంశాల పైన స్పందించారు. గతంలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 50లు పెరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు స్పందించకపోవడం కపటం అన్నారు. కేంద్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచి…రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్‌లను తగ్గించాలని మోడీ చెబుతుండడం ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ఇది ఆయన ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతున్నదని వ్యా ఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత దేశంలో తనకు అత్యంత ఇష్టమైన నాయకుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

పసిడి పంటల పాలమూరు

ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన పాలమూరు జిల్లా ప్రస్తు తం పచ్చగా మారడం సంతోషంగా ఉందన్నారు. గత ఏడు సంవత్సరాల్లో 120 శాతానికిపైగా రాష్ట్రంలో ఫార్మింగ్ పెరిగిందన్నా రు. ఇందుకు ప్రధానంగా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబం ధు, మిషన్ కాకతీయ, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులు ప్రధాన కారణమన్నారు. 2024 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అనేక ప్రతిపక్షా లు, కాంగ్రెస్, బిజెపి నుంచి పోటీ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ తెలిపారు. అయితే ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా విజయం దక్కుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ కన్నా గట్టిగా బిజెపి, మోడీ విధానాలను కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ పార్టీ నిలదీస్తోందన్నారు. రాష్ట్రంలో రోడ్లపైనే హత్యలతో శాంతిభద్రతలకు విఘా తం కలుగుతుందని ఓ నెజిటన్ పేర్కొనగా, నేరాలకు పాల్పడుతు న్న వారిపై తీసుకుంటామన్నారు. భావప్రకటన స్వేచ్ఛ చేసే మాధ్యమాలపై చర్యలుంటాయన్నారు.

#AskKTR

కేంద్రంపై ఆశలు వదులుకున్నాం

నెటిజన్లు అడిగిన ఒక ప్రశ్నకు కెటిఆర్ జవాబు చెబుతూ పూర్తిగా ఆశలు వదులుకున్నామన్నారు. ఏ విషయంలోనూ రాష్ట్రానికి న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఐఐఎం, ఐఐఐటి, ఐఐఎస్‌ఇఆర్, ఎన్‌ఐడి వంటి ఉన్నత విద్యా సంస్థల్లో తెలంగాణకు ఒక్కటీ వాటి కోసం ఎనిమిదేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నా మని, ఇక ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. జీఆర్‌ఎస్ అంశం హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని, బిఆర్‌ఎస్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని యువతకు కల్పన కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఆరోగ్యానికి భారీగా నిధులు

కరోనా సంక్షోభం తర్వాత ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం పెద్దఎత్తున నిధులను కేటాయించిందని కెటిఆర్ హైదరాబాద్‌లో కొత్తగా మూడు టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని ఆధునికం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల్లో స్పెషాలిటీ ఆస్పత్రులను సైతం నెలకొల్పుతున్నామని వెల్లడించారు.

భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు

జాతీయ స్థాయిలో టిఆర్‌ఎస్‌ను విస్తరించే అవకాశం ఉన్నదా? అన్న ప్రశ్నకు స్పందించిన కెటిఆర్ జరగొచ్చు అన్నారు. సేవలు, మీ నాయకత్వం జాతీయస్థాయిలో కావాలన్న సూచనకు ప్రజలకు సేవ చేయడంలోనే ఉన్నదని చెప్పారు.

సమగ్ర రవాణా వ్యవస్థ

హైదరాబాద్‌లోని నాగోల్ ఫ్లైఓవర్ ఆగస్ట్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కెటిఆర్ తెలిపారు. సమగ్రప్రజా రవాణా వ్యవస్థ ఒక్కటే ట్రాఫిక్ సమస్యలను తొలగిస్తుంది.

బడికి నీటి కొరత ఉండదు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పరిశుభ్రమైన త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, భగీరథ’ మంచినీటి సమస్యలను చాలావరకు పరిష్కరించామన్నారు. ఒకవేళ ఎక్కడైనా కొరత ఉంటే ‘మన ఊరు.. మన బడి’ ద్వారా పరిష్కరిస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్‌కు భూసేకరణ త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. జహీరాబాద్‌లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ప్రాజెక్టు భూసేకరణ అత్యంత కీలకమైనదని, ఇప్పటికే అనేక మంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇవిలకు ఇకో సిస్టం

హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఇకో సిస్టం అభివృద్ధి పైన టిఆర్ రెడ్కో కార్యక్ర మాలు రూపొందిస్తుందని కెటిఆర్ తెలిపారు. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లపైన హెచ్‌ఎండిఎ, టిఎస్ ఆర్‌టిసి ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నా రు. ప్రస్తుతం బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని దాన్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నా రు. హైదరాబాద్ నగరం త్వరలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లను కలిగి ఉండబోతుందన్నారు. ఆ తర్వాత నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువులు కలుషితం అయ్యే అవకాశం తగ్గుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో విద్యుత్, మంచినీరు, రహదారుల నిర్వహణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.

బిసిసిఐనే అడగండి

హైదరాబాద్‌లో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించకపోవడంపై స్పందిస్తూ ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించడంలేదో బిసిసిఐకు చెందిన జైషా, సౌరవ్ గంగూలీని అడగాలన్నారు. అన్నిక్రీడలకు సమగ్రమైన సహకారం అందిస్తూ క్రీడా రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నూతన క్రీడా పాలసీని సిద్ధం చేస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News