Friday, January 31, 2025

మహబూబ్ నగర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్‌నగర్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బిజెపి ఇంఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ తదితరులు హాజరుకానున్నారు. బిజెపి నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రెటరీ శివప్రకాష్ హాజరయ్యే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ లో రాష్ట్ర కార్యవర్గం రెండు రోజులపాటు మకాం వేయనుంది. కార్యవర్గ సమావేశాల్లో ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన చర్చించనున్నారు. కార్నర్ మీటింగ్స్, ప్రజా గోస- బిజెపి భరోసా, బైక్ ర్యాలీలపై చర్చలు జరుపనున్నారు. కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. కార్యవర్గం బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై బిజెపి రాష్ట్ర కార్యవర్గం ఫోకస్ పెట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News