Monday, January 20, 2025

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి బంగారు శృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ టిక్కెటు దక్కకపోవడంతో పార్టీ మారుతారని ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నుంచి నాగర్‌కర్నూల్ ఎంపి టికెట్ ఆశించిన బంగారు శృతికి హైకమాండ్ ప్రకటించిన తొలి జాబితాలో సీటు దక్కకపోవడంతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి, ఆపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె అయిన బంగారు శృతి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

ఆమె నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉంది. మొదటి లిస్టులో టిక్కెటు దక్కకపోవడంతో నిరాశతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌లో చేరికపై సిఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపినట్లు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News