Sunday, January 19, 2025

3 రాష్ట్రాల్లో కమల వికాసం

- Advertisement -
- Advertisement -

నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కమలనాథుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. మూడు రాష్ట్రాల్లో విజయానికి బీజేపీ అత్యంత చేరువలో ఉండటం వారిని ఆనందంలో ముంచెత్తుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. మోదీ మ్యాజిక్‌కే ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం వరకూ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఆధిక్యతలపరంగా లీడింగ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లో దాదాపు గెలుపు ఖాయమైంది. రాజస్థాన్‌లో ఆధిక్యాల పరంగా మెజారిటీ మార్క్‌ను బీజేపీ దాటగా, కాంగ్రెస్ 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రధానిని ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

ప్రధానిపై విశ్వాసమే గెలిచింది: శివరాజ్ సింగ్
మరోవైపు, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం వైపు దూసుకుపోతుండటంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఎన్నికల ప్రజారమే విజయానికి ఎంతో దోహదపడిందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల సక్రమ అమలులో విజయవంతమైందని, ప్రజల అభిమానాన్ని మరోసారి చూరగొందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News