Sunday, December 22, 2024

ఏడుగురు ఎమ్‌ఎల్‌ఎలపై బీజేపీ సస్పెన్షన్ వేటు..

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ ఏడుగురు రెబల్ ఎమ్‌ఎల్‌ఎలపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎలైన వీరంతా టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. సస్పెండైన ఏడుగురు ఎమ్‌ఎల్‌ఎలు హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్‌పటేల్, భరత్ భాయ్ చావ్‌డా, ఉదయ్ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా. వీరంతా డిసెంబర్1న జరిగే తొలివిడత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంనుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.

BJP Suspends 7 Rebel MLAs in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News