Friday, November 22, 2024

కాంగ్రెస్ తిరుగుబాటుదార్లకు కమలం గాలం…

- Advertisement -
- Advertisement -

పార్టీలో చేరితే అసెంబ్లీ టికెట్లు ఇస్తామని హామీలు
కుదరక పోతే కేంద్రంలో నామినేటెడ్ పదవులు ఇస్తామని ఒప్పందాలు
హస్తం పార్టీని దెబ్బతీసేందుకు బిజెపి సీనియర్ల వ్యుహాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణ హీటెక్కడంతో ఆయా పార్టీల పెద్దలు బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. రెండు నెల క్రితం అధికార బిఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ రెండు విడుతలో 100 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. బిజెపి మాత్ర ఇంకా అభ్యర్థుల ఎంపికలో కుస్తీ పడుతూ రెండు జాబితాల్లో 53 మందిని ప్రకటించింది. ఇంకా 66 స్ధానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల కితం కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటించడంతో అందులో సీటు లభించని నాయకులు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్దమైతున్నారు.

వారిని కమలనాథులు గాలం వేస్తూ తమ పార్టీలోకి వస్తే టికెట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తూ వారితో పార్టీ సీనియర్లు మంతనాలు జరుపుతున్నారు. జడ్చర్ల, ఎల్లారెడ్డి, నర్సాపూర్, హుస్నాబాద్, మహబూబాబాద్, పాలకుర్తి, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, మహేశ్వరం, దేవరకొండ, తుంగతుర్తి, సూర్యాపేట, పఠాన్‌చెరు, ఇల్లందు, ఆశ్వారావు పేటలకు చెందిన నాయకులను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు. తెలంగాణలో ఈసారి బిజెపి అధికారం చేపడుతుందని, ఒక వేళ రాకుంటే కేంద్రంలో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కమలం పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణరెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి వంటి నాయకులను టికెట్లు ఇస్తామని ఆశలు చూపి ఎంతోమందిని చేర్చుకోవడంతో తామేమి వారికంటే తక్కువ కాదని, హస్తం పార్టీకి చెందిన అసమ్మతి నాయకులను తమ వైపు తిప్పుకునేలా బిజెపి ప్రయత్నాలు వేగం చేసింది.

రెండు రోజుల కితం కాంగ్రెస్‌కు చెందిన రెబెల్స్ నేతలు నగరంలో ఒక హోటల్‌లో సమావేశం నిర్వహించారు అది కూడా బిజెపి పెద్దలే చేశారని కమలం పార్టీలో టాక్ నడుస్తుంది. నేడేరేపో అందులో ఆరు మంది ఆశావాహాలు చేరే అవకాశం ఉందని బిజెపి వర్గాలు అంతర్గత సంబాషనలో వెల్లడిస్తున్నాయి. తమ పార్టీని ఎక్కువగా దెబ్బతీసే కుట్రలకు కాంగ్రెస్ పాల్పడుతుందని, అంత కంటే ఎక్కువ హస్తం పార్టీని మట్టికరిపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక ఎన్నికలతో రెచ్చిపోతున్నా హస్తం నేతలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News