Monday, December 23, 2024

ధరణి పై బిజెపి పూటకో మాట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ధరణి పోర్టల్ విషయంలో బిజెపి వైఖరిని మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. బిజెపి పార్టీది పూటకో మాట, నోటికో మాట అన్నట్లు ఉందన్నారు. గల్లీ బిజెపి నాయకులు ఒకటి చెప్తే, ఢిల్లీ నేతలు ఇంకొకటి చెప్తున్నారని విమర్శించారు. మొన్న ధరణిని రద్దు చేయమని రాష్ట్ర నాయకులు ప్రకటిస్తే, రద్దు చేస్తామని నడ్డా నిన్న చెప్పిన విషయాన్ని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. బిజెపి రెండు నాలుకల ధోరణికి ఇది మరో నిదర్శనమని చెప్పారు. బిజెపిలో నేతల మధ్య శృతి కలవదు, ఒకరి మాట మరొకరు వినరు అని విమర్శించారు. ఇక కాంగ్రెస్ నేతలైతే ధరణి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, గుడ్డిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు. శృతి లేని బిజెపి.. మతి లేని కాంగ్రెస్…! అని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News