- Advertisement -
తెలుగుదేశం, బిజేపి, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ జరిపిన సుదీర్ఘ మంతనాల అనంతరం సీట్ల పంపకంపై ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. జనసేన, బిజేపీలకు 8 లోక్ సభ, 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. మిగిలిన 17 లోక్ సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది.
ఒప్పందం ప్రకారం అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్ సభ స్థానాల్లో బిజేపీ పోటీ చేస్తుంది. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి స్థానాల్లో రెండు చోట్ల జనసేన బరిలోకి దిగుతుంది.
- Advertisement -