Monday, December 23, 2024

వరద బాధిత ప్రాంతాలలో బిజెపి బృందాల పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో బిజెపి బృందాలు పర్యటిస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించేందుకు రాష్ట్ర ముఖ్య నేతలతో కూడిన బృందాలను శుక్రవారం ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పరిశీలించడంతోపాటు, బాధితులకు మనోధైర్యం కల్పించాలని నేతలను ఆయన కోరారు. ఈ నెల 30, 31, అగస్టు 1 తేదీలలో ఈ బృందాలు ఆయా ఉమ్మడి జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఆదివారం ఉమ్మడివరంగల్ జిల్లాలో వరద ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు.
భాగ్యనగరాన్ని భ్రష్టుపట్టిస్తూ ప్రతిపక్షాలపై నిందలు వేస్తారా..
భాగ్యనగరాన్ని భ్రష్టుపట్టిస్తూ ప్రతిపక్షాలపై నిందలు వేస్తారా అని మంత్రి కెటిఆర్ విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అంబర్‌పేట్ తో పాటు జూబ్లీహిల్స్ వెంకటగిరి డివిజన్‌లో పొంగిపొర్లుతున్న నాలాలను ఆయన పరిశీలించారు. స్వయంగా నీళ్లలో నడుస్తూ సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచే అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ’మేము రాజకీయం చేయడం లేదు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తుంటే… రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే రాజకీయాలు చేస్తోంది. నగరంలో వరద కాలువలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు. వర్షపు నీటి కాలువలు పూడిక తీయని కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News