Saturday, December 28, 2024

కమలంలో వీడని ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

తేలని అభ్యర్థుల ఎంపిక, ఆశావహుల్లో అయోమయం
క్యాడర్‌లో నైరాశ్యం, వలస నేతల కోసం ఎదురుచూపులు

మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కమలదళంలో అభ్యర్థ్దుల ఎంపిక కొలిక్కిరావడం లేదు. సార్వత్రిక సమరంలో బిఆర్‌యస్ అభ్యర్థ్దులను ఎంపిక చేసి బిఫామ్‌లు అందచేసి ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ సైతం పలు నియోజకవర్గాలకు అభ్యర్థ్దులను ప్రకటించడంతో పాటు మిగత నియోజకవర్గాల్లో కసరత్తు పూర్తి చేసి నేడో రేపో అదికారికంగా ప్రకటించడానికి సిద్ధమవుతుంది. రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి ప్రచార పర్వంలోకి దిగిన కేంద్రంలో అదికారంలో ఉన్న బిజెపి మాత్రం అభ్యర్థుల ఎంపిక ఇప్పట్లో పూర్తి చేసి ప్రకటించే పరిస్థితులు కనిపించడం లేదు. అభ్యర్థ్దుల ఎంపికపై అదిష్టానం నాన్చుడు దొరణి అవలంబిస్తుండటంతో అశావాహూల్లో టెన్షన్ పెరుగుతు అయోమయంలో కనిపిస్తున్నారు.

పక్క పార్టీలు అభ్యర్థ్దులను ప్రకటించి ప్రచార పర్వంలోకి దిగిన తమ పార్టీ అభ్యర్థులు ఎవరో తెలియక…ఎవరి కోసం పనిచేయాలో..ఎవరికి పనిచేయలో..ఎందుకు పనిచేయాలో తెలియక క్యాడర్‌లో నైరాశ్యం అలుముకుని పక్క చూపులు చూస్తున్నారు.స్వంత పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పక్క పార్టీలు క్యా డర్‌కు వలవేసి తమ పార్టీల్లోకి తీసుకుపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం దక్కించుకుంటామని బీరాలు పలుకుతున్న రాష్ట్రంలో కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో గట్టిపోటి ఇచ్చే నాయకులు కరువయ్యారు. ఉమ్మడి జిల్లాలో 18 నియోజకవర్గాలకు గాను ఒకటి రెండు స్థానాల్లో మినహ మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్దులు ఎవరనే దానిపై ఇంత వరకు స్పష్టత లేకపోవడంతో పార్టీ క్యాడర్ అంతా అమోమయంగా కనిపిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తిలో ఆచారి టికెట్ పక్కా కాగా మిగతా నియోజకవర్గాల్లో మాత్రం స్పష్టత లేదు. మహేశ్వరంలో శ్రీరాములు యాదవ్‌తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, కార్పొరేటర్ అకుల శ్రీవాణి, మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్‌లతో పాటు పలువురు టికెట్ ఆశీస్తున్నా ఇంతవరకు టికెట్‌పై ఎవరికి బరోసా లేకపోవడంతో గ్రూప్‌లుగా విడిపోయి ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్.బి.నగర్‌లో జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్‌లు టికెట్‌లు ఆశీస్తు ఎవరికి వారుగా గ్రూప్‌లుగా విడిపోయారు. రాజేంద్రనగర్‌లో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు టికెట్ ఆశీస్తు ఎవరికి వారుగా విడిపోయి ఎవరికి టికెట్ వచ్చిన మరో నేత పార్టీకి రాం రాం చెప్పడమా…మౌనముద్రలోకి పోవడమా యోచనలో కాలం గడుపుతున్నారు. షాద్‌నగర్‌లో ఐదారు మంది నాయకులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫీక్స్ చేసుకోవాలన్న ఆరాటంలో ఉన్నారు తప్ప టికెట్‌పై ఎవరికి ఇస్తారో తెలియని వాతావరణం కనిపిస్తుంది. శేరిలింగంపల్లిలో యోగానంద్, రవికుమార్‌లతో పాటు పలువురు టికెట్ ఆశీస్తున్నారు.

వలసనేతల కోసం ఎదురుచూపులు…

ఒక్కో నియోజకవర్గంకు పదుల సంఖ్యలో ఆశావహూలు ముందుకు వచ్చి తమకు టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్న పోటి ఇచ్చి విజయం సాదించే స్థాయి నాయకులు మాత్రం కరువయ్యారు. స్వంత పార్టీలో బలమైన అభ్యర్థ్దులు లేకపోవడంతో వలసనేతల కోసం కమలదళం వేచిచూస్తుందన్న ప్రచారం జరుగుతుంది. చెవెళ్ల, ఇబ్రహింపట్నం, వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్‌లతో పాటు పలు నియోజకవర్గాల్లో కనీసం బిఆర్‌యస్, కాంగ్రెస్‌లకు గట్టిపోటి ఇచ్చి డిపాజిట్ దక్కించుకునే స్థాయి నాయకులు సైతం పార్టీలో లేకపోవడంతో వలసనేతల కోసం ఎదురుచూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బిఆర్‌యస్, కాంగ్రెస్‌లో టికెట్ దక్కని నేతలకు గాలం వేసే పనిలో నాయకులు ఉన్నట్లు సమాచారం. శివారులోని మేడ్చల్, కూకట్‌పల్లి, ఉప్పల్ వంటి నియోజకవర్గాల్లో సైతం బలమైన నాయకులు లేక ఇతర పార్టీల నేతల కోసం వేచిచూస్తుంది. బిఆర్‌యస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్దుల ఎంపిక కసరత్తు ప్రాథమిక దశలోనే ఉండటం…ఇప్పటికిప్పుడు అభ్యర్దులను ప్రకటించే పరిస్థితులు మాత్రం కనిపించకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం అయోమయం కంటిన్యూ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News