Monday, December 23, 2024

బిజెపి మూడో జాబితా

- Advertisement -
- Advertisement -

35 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

ఆందోల్ నుంచి బాబుమెహన్, ఉప్పల్ ఎన్వీఎస్ ప్రభాకర్
అంబర్‌పేట నుంచి కృష్ణయాదవ్, సనత్‌నగర్ మర్రి శశిధర్‌రెడ్డికి అవకాశం
ఇప్పటివరకు 88 స్థానాలకు అభ్యర్థులు ప్రకటన

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను బిజెపి గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేస్తారని నాయకులు భావించారు. కానీ టిక్కెట్ కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరికి మించి ఆసక్తి చూపించడం, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆలస్యమైంది.

మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాబుమోహన్‌కు మూడో జాబితాలో ఆందోల్ టిక్కెట్‌ను కేటాయించింది. ఇక ఈ జాబితాలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బాన్సువాడ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆందోల్ నుంచి బాబుమోహన్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, అచ్చంపేట నుంచి దేవని సతీష్ మాదిగ, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. 10 రోజుల కితం రెండు జాబితాల్లో 53 మందిని ప్రకటించింది. ముగ్గురు ఎంపిలను కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దించింది. ఇప్పటివరకు 88 స్ధానాలకు అభ్యర్థులకు ప్రకటించగా అందులో 32 మంది బిసీలు, 24 మంది రెడ్డిలు, 13 మంది ఎస్సీలు, 9 మంది ఎస్టీలు, 6 వెలమలు, బ్రాహ్మణ, వైశ్య, కమ్మలకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది.

థర్డ్ లిస్టులో బీజేపీ అభ్యర్థులు వీరే :
మంచిర్యాల : వీరబెల్లి రఘునాధ్
ఆసిఫాబాద్ (ఎస్టీ) : అజ్మీరా ఆత్మరామ్ నాయక్
బోధన్ : వడ్డి మోహన్ రెడ్డి
బాన్సువాడ : యెండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్ రూరల్ : దినేష్ కులాచారి
మంథని : చందుపట్ల సునీల్ రెడ్డి
మెదక్ : పంజా విజయ్ కుమార్
నారాయణఖేడ్ : జేనవాడే సంగప్ప
ఆంధోల్ (ఎస్సీ): పల్లి బాబూమోహన్
జహీరాబాద్ (ఎస్సీ) : రామచంద్ర రాజనర్సింహ
ఉప్పల్ : ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
ఎల్బీ నగర్ : సామ రంగారెడ్డి
రాజేంద్ర నగర్ : తోకల శ్రీనివాసరెడ్డి
చేవెళ్ళ (ఎస్సీ) : కేఎస్ రత్నం
పరిగి : బూనేటి మారుతీ కిరణ్
ముషీరాబాద్ : పూస రాజు
మలక్‌పేట్ : సామరెడ్డి సురేందర్ రెడ్డి
అంబర్‌పేట్ : కృష్ణా యాదవ్
జూబ్లీ హిల్స్ : లంకల దీపక్ రెడ్డి
సనత్ నగర్ : మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్ : మేకల సారంగపాణి
నారాయణపేట : కే.రతంగ్ పాండు రెడ్డి
జడ్చర్ల : చిత్తరంజన్ దాస్
మక్తల్ : జలంధర్ రెడ్డి
వనపర్తి : అశ్వత్థామ రెడ్డి
అచ్చంపేట (ఎస్సీ) : దేవని సతీష్ మాదిగ
షాద్ నగర్ : అందే బాబయ్య
దేవరకొండ (ఎస్టీ) : కేతావత్ లాలూ నాయక్
హుజూర్ నగర్ : చల్లా శ్రీలతా రెడ్డి
నల్లగొండ : మాదగాని శ్రీనివాస గౌడ్
ఆలేరు : పడాల శ్రీనివాస్
పరకాల : డాక్టర్ పి. కాళీ ప్రసాద్
పినపాక (ఎస్టీ) : పొడియం బాలరాజు
పాలేరు : నున్నా రవికుమార్
సత్తుపల్లి (ఎస్సీ) : రామలింగేశ్వర్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News