- Advertisement -
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితులకు టిక్కెట్లపై ఎస్‌పి, బీఎస్‌పీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. దీనిపై బీజేపీ నేతలు అమిత్‌షా, యోగి ఆదిత్యనాధ్ చేస్తున్న విమర్శలకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అంతే ధీటుగా తిప్పికొట్టారు. నేరచరితులకు టిక్కెట్ల విషయంలో బీజేపీ సెంచరీకి చేరువలో ఉందని ప్రత్యారోపణ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన 29 మందికి బీజేపీ ఇంతవరకు టిక్కెట్లు ఇచ్చిందని ఆరోపించారు. దీనికి ముందు నేరచరిత్ర కలిగిన వారిని అఖిలేశ్ యాదవ్ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ ఆరోపణలు చేయగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యపై ఎన్నికేసులు ఉన్నాయో , ప్రస్తుం అవి ఏదశలో ఉన్నాయో చెప్పాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు.
- Advertisement -